ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభానికి వస్తున్న నరేంద్ర మోడీ రాకను అడ్డుకుంటారని చెప్పి ముందస్తుగా అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కాపురి సూర్యను వన్ టౌన్ సీఐ ప్రసాద్ రావు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ ..కేంద్రంలో అధికారంలోకి రాకముందు మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి నిరుద్యోగ యువతను నట్టేట ముంచారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి ఎన్డీఏ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణమని విమర్శించారు. ప్రముఖ ఐఐటి, ఐఐఎం నవోదయ పాఠశాలలు అన్ని గుజరాత్ కి తరలిస్తూ తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్ సీ ఎల్ ప్రొడక్షన్ ప్రారంభమై ఏడాది గడుస్తున్న ఇప్పుడు ఆర్ఎఫ్ సీ ఎల్ ప్రారంభమంటూ రాజకీయ డ్రామాకు తెరలేపిన బిజెపికి అఖిల భారత యువజన సమాఖ్యగా తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఆర్ ఎఫ్ సీ ఎల్ లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక తీవ్ర నిరాశాన్ని స్పృహల్లో ఉంటే బిజెపి ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉప ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ రోజు కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రతీకారాన్ని తెలంగాణ అభివృద్ధి మీద చూపిస్తూ ప్రతి విషయంలో తెలంగాణకు మొండిచేయి చూపిస్తున్నారని తెలంగాణలో ఐటిఐఆర్ ప్రాజెక్టును వెంటనే పున ప్రారంభించాలని లేదా ఆ స్థాయిలో ఒక పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నామన్నారు. అరెస్ట్ అయిన వారిలో సూర్యతో పాటు విజయ్ ఉన్నారు
Admin
Aakanksha News