ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మంచిర్యాల జిల్లా : దేశంలో బీసీలు లేకపోతే దేవుళ్ళకు కూడా పండుగలు కరువయ్యే పరిస్థితి తలెత్తుతుందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ ఉద్ఘాటించారు.. దేశ గణనలో ఎస్సీ ఎస్టీల గణనతో పాటు బీసీలను కూడా లెక్కించకపోవడం దేశద్రోహమే అవుతుందని తెలిపారు.. దేశవ్యాప్తంగా బీసీలు ఒక్కటవుతున్నారన్న నెపంతోనే జాతీయస్థాయిలో బీసీల గణనను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకాడుతుందని మండిపడ్డారు..ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర కోఆర్డినేటర్ మాచర్ల శ్రీనివాస్ నేతృత్వంలో మంచిర్యాల లోని నస్పూర్ ప్రెస్ క్లబ్ నందు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు..కార్యక్రమానికి హాజరైన నాయకులను ఉద్దేశించి దాసు సురేశ్ మాట్లాడుతూ బీసీలు న్యాయంగా తమకు దక్కాల్సిన 50% అవకాశాలను దక్కించుకోవడమే నిజమైన ధర్మమని అందుకోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ హక్కుల సాధన కోసం విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు..ఊరికి ఒకరు కలిసి వస్తే రాష్ట్రంలో, దేశంలో రాజకీయ పార్టీలకు బీసీల పట్ల అనివార్యత సృష్టిస్తామని., ఇంటికొకరు కలిసి వస్తే రాజ్యాధికారాన్ని అట్టడుగు వర్గాల చేతిలో బహుమతిగా అందిస్తామని దాసు సురేష్ పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి మహిళా ఉపాధ్యక్షురాలు ఏరుగొండ పద్మావతి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారు పద్మావతి, ప్రధాన కార్యదర్శి గోషిక స్వప్న ,పారసాని దుర్గేష్ ప్రసన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు జంగోని స్వరూప, బుర్రా కుమార్ గౌడ్ , జూలూరి రమేష్ గౌడ్ , రాష్ట్ర కార్యదర్శి ముంజాల రాజేందర్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వీరేందర్ గౌడ్ , ప్రముఖ సామాజిక వేత్త కోడూరి చంద్రయ్య , సింగరేణి ఓబీసీ కార్మిక యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, బీసీ ఐక్యవేదిక ముఖ్య నాయకులు రంగు రాజేశం , గుమ్ముల శ్రీనివాస్ , వడ్డేపల్లి మనోహర్ , స్థానిక బీసీ నాయకులు కోట వెంకన్న, ఆడెపు లక్షీణారాయణ తదితరులు పాల్గొన్నారు ..
Admin
Aakanksha News