Tuesday, 11 August 2026 05:45:28 PM

మద్యపాన నిషేధం ఐపీసీ తోనే సాధ్యం

లీగల్ విభాగం సెక్రటరీ అడ్వకేట్ లక్ష్మి

Date : 27 October 2023 06:49 PM Views : 456

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సంపూర్ణ మధ్యపాన నిషేధం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఐపీసీ లీగల్ విభాగం సెక్రటరీ అడ్వకేట్ లక్ష్మి అన్నారు శుక్రవారం లిబర్టీ ప్లాజా బషీర్బాగ్ హైదరాబాద్ లోని ఐపిసి క్యాంప్ ఆఫీసులో ఐపీసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబి శ్రీధర్ ని కలిసి అసెంబ్లీ ఎన్నికలలో ఐపీసీ లీగల్ విభాగం తరఫున పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐపీసీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ స్వాగతించారు ఈ సందర్భంగా అడ్వకేట్ లక్ష్మీ మాట్లాడుతూ ఐపిసి పంచసూత్రాలైన మాతృ ప్రేమతో పరిపాలన ప్రతి మనిషికి విద్య వైద్యం ఉచితం భారతదేశ మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం మతసామరస్యాన్ని పాటిస్తూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం మానవసేవే మాధవసేవ స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించడమే ధ్యేయంగా పనిచేస్తున్న ఐపీసీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి నిలబడుటకు సంసిద్ధతను తెలిపారు మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నట్లు ముఖ్యంగా యువత చెడు మార్గాన వెళుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు వీటికి పరిష్కారం సంపూర్ణ మద్యపాన నిషేధం మే అని తెలిపారు ఈ సందర్భంగా మద్యపాన నిషేధంపై మహిళా సంఘాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో అడ్వకేట్ సంధ్య ఐపీసీ సెక్రెటరీ రామ్మూర్తి మరియు ఐపీసీ లీగల్ విభాగం నాయకులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :