ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయ హస్తం, 6గ్యారెంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని గ్రామ కార్యదర్శి శివప్రసాద్ ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.గృహాలు లేని వారికి ఆసరాగా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిందన్నారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించుట కొరకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు.మైలారం గ్రామం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీ కృష్ణలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లికంటి. శ్రీనివాసులు, ఉప సర్పంచ్ బాలీశ్వరమ్మ భగవాన్ రెడ్డి, మాజీ వార్డ్ నెంబర్,నారాయణ, బి ఎల్ ఏ భాస్కర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరగదిండ్ల శ్రీశైలం ఎల్లికంటిజగదీశ్వర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉదరి శివ,వెంకటయ్య, మౌలాల్, దార మల్లయ్య, శైలజ,కర్ణ, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News