Tuesday, 11 August 2026 03:51:03 PM

బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఏలేటీ మహేశ్వరరెడ్డి..

Date : 14 February 2024 04:26 PM Views : 413

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఏలేటీ మహేశ్వరరెడ్డిని ఆ పార్టీ హై కమాండ్ బుధవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఫ్లోర్ లీడర్‌తో పాటు మిగతా సభ్యులను కూడా అధిష్ఠానం నియమించింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పాయల్ శంకర్, చీఫ్ విప్‌గా పాల్వాయి హరీష్ బాబు, విప్‌గా ధన్ పాల్ సూర్యనారాయణ, ట్రెజరర్‌గా పైడి రాకేష్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీగా రామారావు పాటిల్‌ను బీజేపీ హై కమాండ్ నియమించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ 8 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే.కాగా.. ఏలేటి మహేశ్వర రెడ్డి నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే అసెంబ్లీ బీఏసీ సమావేశానికి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరిని పిలవాలని ఆ పార్టీ శాసనసభ్యులు స్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని పిలవాలని బీజేపీ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు అందించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వరరెడ్డి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. దీనిని బట్టి బీజేపీ శాసనసభా పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి పేరును బీజేపీ హై కమాండ్ ఖరారు చేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :