ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. తన బిడ్డకు పుట్టిన మగ శిశువును అమ్మకానికి ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు.గోదావరిఖని ఎన్టీపీసీలో నివాసముండే ఆకాంక్ష డెలివరీ కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రాగా 7 రోజుల క్రితం పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆకాంక్ష పడకున్న సమయంలో బుధవారం తెల్లవారుజామున అమ్మమ్మ రమణమ్మ తన కూతురు పుట్టిన మగ శిశువును అమ్మకానికి ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు నరేష్ తో పాటు మిగతా సిబ్బంది పట్టుకొని శిశువును తల్లికి అప్పగించి పోలీసులకు సమాచారం అందించారు. సొంత తల్లి తన బిడ్డను అమ్మకానికి ప్రయత్నించడంతో కూతురు కన్నీటి పర్యంతమవుతుంది. దీంతో ఈ ఘటన గోదావరిఖనిలో సంచలనంగా మారింది.
Admin
Aakanksha News