Tuesday, 11 August 2026 07:32:33 PM

టిఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా...

బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే

Date : 06 October 2022 04:03 PM Views : 693

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మేదక్ జిల్లా : పరకాల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మొలుగురి బిక్షపతి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..టిడిపి పార్టీ నుంచి సర్పంచ్ గా గెలిచి జెడ్పిటిసిగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి కొండ సురేఖ పార్టీకి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపు సాధించారు.2014లో పార్టీ అధిష్టానం అవకాశం ఇవ్వక పోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు.దీనికి తోడు అనారోగ్యంకు గురి అయ్యారు. అయితే తాజాగా మనస్థాపానికి గురై మాజీ ఎమ్మెల్యే బిక్షపతి బిజెపి గుటికి చేరెందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. దీనికి తోడుగా ఆయన అనుచరులు సైతం బీజేపీలోకి చేరేందుకు నిర్ణయించుకున్నారు. దీనిని ఆయన అధికారికంగా ప్రకటించారు.9వ తేదీన మెదక్ జిల్లా నర్సాపూర్ లోని భారీ బహిరంగ సభలో రాష్ట్ర జాతీయ నాయకులతో బిజెపి పార్టీలకు చేరుతున్నట్లు ప్రకటించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :