Monday, 10 August 2026 01:00:59 PM

ప్రశ్నిస్తే అనగదోక్కుతున్నారు...

Date : 03 August 2023 10:41 AM Views : 1312

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రశ్నిస్తే అనగదోక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆశావాహులు పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, రామగుండం నగరపాలక సంస్థ తొలి మాజీ మేయర్ కుంకటి లక్ష్మీనారాయణ, బసంత్ నగర్ పర్మినెంట్ కార్మిక సంఘం నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాతిపల్లి ఎల్లయ్యలు ఆరోపించారు.. ఈ మేరకు రామగుండం రీజియన్ లోని 11ఏ బొగ్గు గని వద్ద కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ... ప్రజలకు సేవ చేయడానికి రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ అడగడమే మేము చేసిన తప్ప అని వారు ప్రశ్నించారు. రామగుండం ఎమ్మెల్యే ఆర్ఎఫ్ సీ ఎల్ తో పాటు సింగరేణి, మెడికల్ కాలేజీలో ఉద్యోగాల కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. దీంతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారని కార్మికులకు వివరించారు. అలాగే బూడిద ఇసుక కుంభకోణాలకు సైతం పాల్పడ్డారని అన్నారు. ఎమ్మెల్యే చేసిన ఎమ్మెల్యే చేసిన అవినీతి కుంభకోణాలను కార్మికులకు వారు వివరించారు. అలాగే ఈ నెల 6వ తేదీన నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :