Friday, 25 September 2026 09:53:43 PM

మెడిక‌ల్ వ్యాల్యూ టూరిజం డెస్టినేష‌న్‌గా హైద‌రాబాద్...

రాష్ట్ర వైద్యారోగ్య, మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ

Date : 26 February 2024 09:08 PM Views : 1004

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ సండర్సన్, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హెల్త్‌కు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో సమావేశమయ్యారు. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో మెడికల్, పారామెడికల్ హెల్త్ కేర్ రంగాలలో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ‌తో చర్చించారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ద్వారా నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా 8515 మెడికల్ గ్రాడ్యుయేట్స్, 6880 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్స్‌తో పాటు 22,970 మంది పారా మెడికల్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగరం మెడికల్ వ్యాల్యూ టూరిజం డెస్టినేషన్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినట్లు మంత్రి వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్)ద్వారా నర్సింగ్, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రొఫెషనల్స్‌గా శిక్షణ ఇచ్చి వారు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన మెడికల్, పారా మెడికల్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి దామోద‌ర‌ రాజనర్సింహ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా వైద్య శాఖ మంత్రి అంబర్ జెడ్ సండర్సన్ కు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ సండర్సన్‌ను ఘనంగా సన్మానించారు.ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోoగ్తూ, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ వి కర్ణన్, TOMCOM సీఈవో డా. విష్ణువర్ధన్ రెడ్డి, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ హైమావతి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో విశాలాక్షి, డాక్టర్ వాణి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (అడ్మిన్), డాక్టర్ శివరామ ప్రసాద్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (అకాడమిక్) నిమ్స్ డైరెక్టర్ బీరప్పలతో పాటు గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ మినిస్టర్ చీఫ్ ఆఫ్ స్టాప్ – స్టేసీ హార్న్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ – జోడి సౌత్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ కమిషనర్ ఇండియా-గల్ఫ్, ఇన్వెస్ట్ అండ్ ట్రేడ్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా – నషీద్ చౌదరీలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :