Sunday, 27 September 2026 01:19:11 AM

ఉద్యోగాల దందా గుట్టు రట్టయ్యేనా...?

కొరవడిన ఉన్నతాధికారుల నిఘా...?

Date : 03 February 2023 01:41 PM Views : 687

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఉద్యోగాల పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారా... అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి... ప్రభుత్వ ఆసుపత్రి నుండి జనరల్ ఆసుపత్రిగా మారడంతో ఎంతోమందికి మెరుగైన వైద్యం అందడంతో పాటు ఉపాధి అవకాశాలు వస్తాయని భావించిన వారి ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. కొందరు తమకున్న రాజకీయ పలుకుబడిని అడ్డంగా పెట్టుకుని ప్రభుత్వాసుపత్రిలోని ఉద్యోగ దందాలో కీలకంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది కింది స్థాయి సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా వారి కిందిస్థాయి సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తూ వారిని వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఆసుపత్రిలో జరిగిన ఉద్యోగ నియమాకాల్లో కొందరు కిందిస్థాయి సిబ్బంది కీలకంగా వ్యవహరించారని సమాచారం. ఓవైపు ఖద్దర్ చొక్కా ధరిస్తూ... మరోవైపు ఆసుపత్రి యూనిఫాం లో ఉంటూ ఉంటూ ఆసుపత్రిలో రాజకీయం చేస్తున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అయితే గతంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఓ అధికారినికి సంబంధించిన ఓ ప్రైవేటు వ్యక్తి ఈ ఉద్యోగాల్లో కీలకంగా వ్యవహరించాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. సదరు ప్రైవేట్ వ్యక్తితో పాటు నిఘా విభాగంలో పనిచేసే ఓ ఇద్దరూ సిబ్బందితో పాటు ఆస్పత్రిలో లేని పోస్టును సృష్టించుకొని సమాచార సేకరణలో పనిచేస్తున్న మరో వ్యక్తి ఈ ఉద్యోగ దందాలో కీలకంగా వ్యవహరించినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. సదురు సిబ్బంది ఆస్పత్రి విధి నిర్వహణలో విధులు నిర్వహించడంలో అలసత్యం వహించిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు ఆస్పత్రిలో పనిచేసే సదురు ప్రైవేటు వ్యక్తి అండదండలతో కొందరు సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నట్లు వినికిడి. అయితే ఇంత జరుగుతున్న సదురు ప్రైవేటు వ్యక్తి ఆగడాలు మితిమీరిపోతున్న ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వెనుక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లా స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెబుతున్న అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. జిల్లాలో ఉన్నత స్థాయి క్యాడర్ ఉన్న స్థానిక అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా దీనిపై వైద్యారోగ్య శాఖ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా ఈ ఉద్యోగాల దందాపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :