ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎండపల్లి మండలం కొత్తపేట వద్ద ఓ ప్రైవేట్ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. బస్సులో ఉన్న సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో చిన్నారులుసైతం ఉన్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గజ్వేల్ నుండి అస్తికలు కలిపేందుకు ధర్మపురి లకి ప్రైవేటు బస్సులో బయలుదేరిన 50 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Aakanksha News