Friday, 25 September 2026 06:06:58 PM

హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరుకంటి

Date : 05 May 2023 08:46 AM Views : 634

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చాలీసా పారాయణం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ భక్తులతో కలసి రామాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆలయంలో హనుమాన్ భక్తులతో కలసి 24 గంటల చాలీసా పారాయణం చదివారు. గురువారం ప్రారంభం అయిన ఈ పారాయణనికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో పవిత్రమైన మాలధారణ ధరించిన హనుమాన్ భక్తులు తమ భక్తిని చాటుతూ నిత్యం ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఎల్లవేళలా రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :