Saturday, 26 September 2026 08:04:59 PM

గోదావరిఖని నుండి శబరిమల యాత్రకు స్వాముల పాదయాత్ర

Date : 01 November 2022 11:59 AM Views : 678

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని కోదండ రామాలయం అయ్యప్ప స్వామి దేవాలయం నుండి సతీష్, రంజిత్ అనే ఇద్దరు స్వాములు మంగళవారం శబరిమల సన్నిధానానికి చేరుకోవడానికి పాదయాత్ర చేపట్టారు. 45 రోజులపాటు కొనసాగనున్న ఈయాత్రలో మొత్తం 1450 కిలోమీటర్లు స్వాములు పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర హైదరాబాద్ కు చేరుకోగానే అక్కడ నుండి హైదరాబాదుకు చెందిన స్వాములతో యాత్ర కొనసాగించనున్నారు.. స్వాములకు ఆలయ పూజారులు రామకృష్ణ శర్మ, చంద్రశేఖర శర్మ, శశిధరాచార్యులతోపాటు అయ్యప్ప మాలధారణ స్వాములు సతీష్, రాము,కుమార్లతోపాటు ఇతర స్వాములు శాలువాలతో సత్కరించి సాగనంపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :