Tuesday, 11 August 2026 12:37:14 PM

నా చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తా..

కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

Date : 15 August 2023 08:09 PM Views : 760

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : నా చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు.గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మహిళ కాంగ్రెస్,యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా దీవెన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ....రామగుండంలో పుట్టి పెరిగి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే తపనతో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కూడా మరుసటి రోజు నుంచి ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరిగిందని అన్నారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, పేద ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. అనంతరం ఆయన జన్మదినం సందర్భంగా గజ మాలతో సత్కరించారు. కేక్ కట్ చేశారు.ప్రజలు, నాయకులు, అభిమానులు శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :