Sunday, 07 December 2025 08:57:28 AM

రేపటి నుంచి తెలంగాణ వాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

Date : 05 December 2024 08:19 PM Views : 462

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రేపటి నుంచి తెలంగాణ వాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతీ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌజ్ ఉంటుందని, మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తామన్నారు. నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గ్రామ సభలో ఇందిరమ్మ కమిటీలు ద్వారా అర్హుల ఎంపిక చేస్తామన్నారు.దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదని తెలిపారు. పది వేల రూపాయాలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇవాళ రూ.5 లక్షలకు చేరుకుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామని, ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల అని, రోటీ, కపడా, ఔమర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం అని, ఇల్లు, వ్యవసాయ భూమిని ఆత్మగౌరవంగా భావిస్తారని, అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూపంపిణీ పథకాలను ప్రారంభించారని, అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.గతంలో కెసిఆర్ రద్దు చేసి గృహనిర్మాణశాఖను పునరుద్ధరించామన్నారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :