Monday, 10 August 2026 02:57:28 PM

రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక అసత్య ప్రచారం...

సోషల్ మీడియాలో ప్రచారంపై ఫిర్యాదు..వధంతులపై కౌన్సిలర్ గాదె మాధవి ఆవేదన..

Date : 13 November 2024 01:36 PM Views : 558

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం బాధాకరమని పెద్దపల్లి మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ గాదె మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తన నివాసంలో భర్త గాదె మోహన క్రిష్ణా రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాధవి మాట్లాడుతూ, తమకు చెందిన విలువైన 28గజాల భూమిని మరిదికి 2018లో దానంగా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపిన ఆమె తదనంతరం తమ అవసరాల నిమిత్తం అట్టి భూమిని లీజుకు తీసుకొని ప్రతీనెల కిరాయి చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ భూమిలో వేసిన తడకల షెడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోవడంతో తమ మరిది అనుమతి తీసుకొని మరీ టీ స్టాల్ కంటెయినర్ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు. కానీ, కొంతమంది వ్యక్తులు తనమరిది కుటుంబానికి లేనిపోని అనుమామానాలు సృష్టించి తమ మద్య గొడవలు పెట్టించి, కంటెయినరును తొలగించారని తెలిపారు. తాము దానంగా ఇచ్చిన భూమిని మళ్ళీ కబ్జా చేసుకునే అవసరం తమకులేదని స్పష్టం చేశారు.

రెండు కేసుల నమోదు..

తమను రాజకీయంగా ఎదురుకోలేక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, చంపుతామని బెదిరింపులకు గురిచేసి, కిరాయి అగ్రీమెంటును ధిక్కరించినందుకు పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండు కేసులు నమోదు చేసినట్లు మాధవి తెలిపారు. తన మరిది గాదె చంద్రశేఖర్, మరిది మూడవ భార్య గాదె సుష్మ, మరో ముగ్గురిపై కేసు నమోదయ్యిందన్నారు. త్వరలో పరువునష్టం దావా వేయనున్నట్లు వివరించారు. తన మరిది పేరున ఉన్న ఆస్థులను తన పేరున రాయింకున్న మరిది మూడవ భార్య సుష్మ, ఆరేళ్ళుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన మరిది చావుకు నన్ను బాద్యురాలిని చేసి కేసుల నుండి తప్పించుకోవాలని చూస్తున్నదని మాధవి ఆరోపించారు. గ్రామంలో ప్రజల సానుభూతి పొందడానికి తన మరిది మూడవ భార్య సుష్మ చేస్తున్న అసత్య ప్రచారాలను న్యాయపరంగా ఎదురుకొంటానని మాధవి స్పష్టం చేశారు. సుష్మ కుటుంభ సభ్యుల నుండి తమకు ప్రాణహాని పొంచి ఉందని, అనుమానస్పదంగా కొంతమంది వ్యక్తులు తమ ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్నరాని ఆమె భయాందోళన వ్యక్తం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :