Saturday, 18 January 2025 10:15:05 AM

సింగరేణి, ఎన్టీపీసీ,ఆర్ ఎఫ్ సి ఎల్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి

జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గోమాసి

Date : 13 November 2022 09:17 PM Views : 196

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాడాలని జాతీయ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గోమాసే అన్నారు.ఆదివారం గోదావరిఖని పట్టణంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామగుండం నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ, బంజారా హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రాములు నాయక్, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు ఈర్ల కొమురయ్య లతో కలిసి గోమాసే శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాన్ని, చట్టాలను ఆమోదింపజేసుకునేందుకు రైతుల భవిష్యత్తుకు బిజెపి ప్రభుత్వం మరణ శాసనం రాసేందుకు పూనుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరలు పెంచాలని, విద్యుత్‌ సంస్కరణల పేరుతో సబ్సిడీ ఎత్తివేసే చర్యలకు పూనుకుందని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలనే ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలకడం తగదన్నారు. ఎన్నో ఏళ్లుగా భారత ప్రజలు త్యాగాలతో నిర్మించుకున్న ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వేలు, విమాన వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేసే ఆలోచన విరమించుకోవాలన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తుందని, దళితుల రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ రక్షణ చట్టాలు వివిధ రూపాల్లో నీరుగారుతుందని, మహిళలకు రక్షణ కరువైందని అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ అవుతాదని నీళ్లు, నిధులు, నియామకాలు, పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. రాజకీయ లబ్ది కోసం ప్రజలను పావులగా వాడుకుంటున్న అని మండిపడ్డారు.ఉద్యమ సమయంలో ప్రజలను సీఎం కేసీఆర్ ప్రజలని, యువతను రెచ్చగొట్టి ప్రాణ త్యాగాలు చేసుకునే స్థాయికి తీసుకుపోయరన్నారు.తీరా తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యమ కారులను తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలను విస్మరిస్తుందన్నారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే రాజకీయం చేస్తూ ఉద్యమాన్ని నీరు గడుస్తున్న నేతలకు ఉన్నత రాజకీయ పదవులు ఇస్తుందన్నారు. మంత్రులను, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, లను ఉద్యమకారులను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన కూడు, గూడు,గుడ్డ, విద్య వైద్యం ఉపాధి మొదలైన కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలు ఎండగట్టాలంటే 93 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం ఏకం కావాలని నవభారత నిర్మాణం కోసం రూపొందించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని సూచించారు దేశ సంపద మొత్తం 500 మంది దళారుల చేతుల్లో ఉందని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు దళారుల చెప్పు చేతల్లో పనిచేస్తూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని తెలిపారు. కాబట్టి కే డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో కర్రు కాల్చి వాత పెట్టి బుద్ధి చెప్పడానికి కంకణబద్ధులం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జనాభా తమాషా ప్రకారం సామాజిక న్యాయం జరిగేలా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్, బంజారాల సంఘం జాతీయ అధ్యక్షులు రాములు నాయక్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు నీలకంఠేశ్వరరావు, నేతకాని మహార్ హక్కుల పరిరక్షణ సంఘం సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ బండారి కనకయ్య, పౌర హక్కుల సంఘం నాయకులు ఏలేశ్వరం వెంకటేశ్వర్లు భూ పోరాట సమితి నాయకులు ఎరుకల రాజన్న , సమతా సైనిక దళ్ సీనియర్ నాయకులు పాగే భూమయ్య, బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మైస రాజయ్య, కామెర లక్ష్మణ్, ముస్లిం మైనారిటీ నాయకులు, క్రిస్టియన్ మైనారిటీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు , ఆదివాసి సంఘాల నాయకులు, మాదిగ సంఘాల నాయకులు, మాల సంఘాల నాయకులు, యాదవ సంఘం నాయకులు నాయి బ్రాహ్మణ సంఘాల నాయకులు, రజక సంఘాల నాయకులు పెరిక సంఘాల నాయకులు ముదిరాజ్ సంఘాల నాయకులు, మొత్తం 33 సంఘాలకు సంబంధించిన ముఖ్య నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు