ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లాలో దీర్ఘకాలికంగా విధులకు డుమ్మా కొడుతున్న 16 మంది టీచర్లపై వేటు పడింది. వారిని సర్వీస్ నుంచి తొలగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలకు రాకుండానే అన్ని సదుపాయాలు పొందుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ గీతారాణి, ఎస్జీటీలు విజయలక్ష్మీ, శ్రీనివాస్ రెడ్డి, ఉమారాణి, ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్ హమీద్, స్వప్న, మాధవి, నవీన్ కుమార్, ఎం.ఉమాదేవి, క్రాంతి కిరణ్, జె.ఉమాదేవి, నర్సింహారావు, శైలజ, భాగ్యలక్ష్మీ, కిరణ్‌కుమారి 2005 నుంచి 2022 వరకు అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యారు. ఈ విషయం విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో.. దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవ్వడంపై వివరణ ఇవ్వాలని సదరు ఉపాధ్యాయులను నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ స్పందించలేదు.దీంతో విద్యాశాఖ అధికారులు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి 16 మంది ఉపాధ్యాయులను సర్వీసు నుంచి తొలగించారు. ఈ విషయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా డీఈవో సత్యనారాయణ తెలిపారు.యాదాద్రి జిల్లాలో 16 మంది ప్రభుత్వ టీచర్లను విధుల్లో నుంచి తొలగించారు. వీరు దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరు కావడంతో డీఈవో ఇటీవల నోటీసులిచ్చారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Admin
Aakanksha News