Friday, 25 September 2026 11:17:24 PM

సింగరేణిలో గని ప్రమాదం..

Date : 01 November 2022 10:05 AM Views : 805

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం ఏరియా గోదావరిఖని 11వ బొగ్గుగనిలో తెల్లవారు జామున 3,గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది.సీయం-1. 79వ లెవల్ లో 6గురు కార్మికులు పని చేస్తు ఉండగా ఒక్క సరిగా కంటిన్యూయార్స్ మైన్ లో ఎయిర్ రావడం తో రవి అనే కార్మికుడి తలకు బలమైన గాయం కాగా మరో నలుగురు కార్మికులు సురక్షితంగా బయట పడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన కార్మికుడు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకుని గాయపడిన కార్మికుడి నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ... సింగరేణిలో అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని సేఫ్టీ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని ఒకే పనిని కార్మికులకి అప్పగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. నాకు పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం అధికారులే వహించాలని వారు డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :