Thursday, 24 September 2026 03:33:20 PM

డీజీపీ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ

Date : 12 December 2023 11:25 AM Views : 525

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను ఈసీ అధికారులు సస్పెండ్ చేశారు. ఎన్నికల ఫలితాల రోజు నింబధలనకు వ్యతిరేకంగా డీజీపీ రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని కలవడాన్ని ఈసీ అధికారులు సీరియస్ గా పరిగణంలోకి తీసుకొని డీజీపీ అంజనీ కుమార్ ను ఈసీ సస్పెండ్ చేసింది. అయితే దీనిపై డీజీపీ అంజనీ కుమార్ తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించ లేదని..ఎన్నికల ఫలితాల రోజున రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్ళానని…మరోసారి ఇలా జరగదని అంజనీ కుమార్ వివరణ ఇచ్చారు. దీంతో ఈ విజ్ఞప్తిని స్వీకరించిన ఈసీ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. సమాచారాన్ని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :