ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల కంటే రామగుండం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఓ జాతీయ పార్టీ నేతను ఓడించడానికి ఓ ముఖ్య నేత తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఏత్తులకు పై ఎత్తులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి రామగుండం నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని ఓ నేత తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే ప్రజల్లో పట్టు సాధించి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని మరో నేత ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న పోటీ నేపథ్యంలో ఎక్కడ అధికారం కోల్పోతామో అని ఓ నేత జాతీయ పార్టీకి చెందిన కొంతమంది నాయకులకు భారీగా ఆఫర్లు ప్రకటించినట్లు సమాచారం. అయితే మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను ఓడించడమే లక్ష్యంగా కొంత మంది జాతీయ పార్టీ నేతలతో ఓ ముఖ్య నేత భారీగా ఆఫర్లు ప్రకటించడంతో పాటు స్థానిక ఓ నేతకు ఎంపీ పదవిని ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రామగుండంలో జరుగుతున్న ఈ రాజకీయంపై పూర్తి వివరాలతో త్వరలో "ఆకాంక్ష" న్యూస్ లో ప్రత్యేక కథనం...
Admin
Aakanksha News