Tuesday, 11 August 2026 10:52:12 PM

గురుకుల పాఠశాల గెట్లకు తాళాలు వేసిన వారి పై క్రిమినల్ కేసులు..

కలెక్టర్లకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు

Date : 15 October 2024 06:53 PM Views : 372

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : గురుకుల పాఠశాల గెట్లకు తాళాలు వేసిన వారి పై క్రిమినల్ కేసులు వేయాలని కలెక్టర్లకు - రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారి చేసారు.దసరా సెలవుల అనంతరం విద్యాశాఖకు సంబంధించి గురుకులాలు, కాలేజీలు , పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి.70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి..ఇది ఈ 10 నెలల్లో పెట్టిన బకాయిలు కాదు ఇది యజమానులు గమనించాలి..గత కొద్ది సంవత్సరాలుగా రాని బకాయిలు అడగలేక..గౌరవ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వివరాలు తెప్పించుకొని వాటిని విడుదల చేసి భవనాల సమస్యలు పరిష్కరించాలని సమావేశాలు కూడా నిర్వహించాము..నేడో రేపు నిధులు విడుదల చేసే సమయంలో ప్రభుత్వంతో ఎవరి మాటలు పట్టుకొని కావాల్సి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరుతున్న..ఇది మంచిది కాదు ప్రభుత్వం బకాయిలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది..గురుకుల మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్న ఇబ్బందితో గురుకుల పెట్టిన బ్యానర్లు వెంటనే తొలగించాలి..విద్యార్థులకు సక్రమంగా తరగతులు నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలి..లేదంటే ప్రభుత్వపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాత బకాయిలు ఇప్పించే బాధ్యత మాది నేను ,ఉప ముఖ్యమంత్రి భక్తివిక్రమార్క అన్ని గురుకులాల పై సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు.. గురుకుల భవనా యజమానులకు విజ్ఞప్తి వెంటనే బ్యానర్లు తొలగించాలి..విద్యార్థులకు స్వాగతం పలకండివారి విద్యా బోధనకు ఆటంకం కలిగిస్తే చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉంటాయో మీకు తెలుసు..మీకు బకాయిని చెల్లించే బాధ్యత మాది లేదంటే నన్ను గాని ,ముఖ్యమంత్రి ని కానీ అధికారులను కలవండి..పాత బకాయిలతో సహా మెస్ చార్జీలు మూడు రోజుల క్రితమే చెల్లించాం..గురుకులాలు తాళం వేసి తలుపులు వేస్తే కఠిన చర్యలు ఉంటాయి..గురుకుల ప్రిన్సిపల్ అర్సీవో లు ఎక్కడైనా యజమానులు ఇబ్బందులు పెడితే పోలీస్ స్టేషన్ లో పిర్యాదులు చేయండి.. క్రిమినల్ చర్యలు తీసుకోండి..కలెక్టర్ లకి ఆదేశాలు ఇస్తున్నాం ప్రత్యామ్నాయంగా అక్కడ నుండి ఖాళీ చేసి వేరే భవనాలు చూడండి..బకాయిలు చెల్లించే బాధ్యత మాది అని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :