ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / రంగారెడ్డి జిల్లా : సమర్ధవంతమైన పాలనకు ఓటుహక్కు ముఖ్యమని,అందుకు రాజ్యాంగం కల్పించిన ఓటు వినియోగించుకోవాలని తహసీల్దార్ పార్థసారథి అన్నారు..14వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా షాద్ నగర్ ఆరోగ్య శాఖ,మున్సిపల్ శాఖ,రెవెన్యూ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు.ఇందులో స్థానిక రెవిన్యూ కార్యాలయం నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం సంబంధిత అధికారులు మాట్లాడుతూ,,ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని,అందుకోసం ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్,ఆరోగ్య శాఖ షాద్ నగర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ., జయలక్ష్మి,ఫరూక్ నగర్ తహసీల్దార్ పార్థసారథి,గిరిజదావర్ సలీం,విజయలక్ష్మి,చౌదరగూడ తహసీల్దార్ విజయకుమార్,కేశంపేట ఎమ్మార్వో నిజాం,నందిగామ తహసీల్దార్ అయ్యప్ప,కొత్తూరు తాసిల్దార్ జానకి,మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ ఎడ్యుకేటర్ జై శ్రీనివాసులు, డాక్టర్ జగదీష్ ,డాక్టర్ కార్తీక్ ,మున్సిపల్ కమిషనర్ వెంకన్న,గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ రవీందర్ రెడ్డి,ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, రెవిన్యూ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు..
Admin
Aakanksha News