Saturday, 26 September 2026 06:19:57 PM

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు...

Date : 30 January 2025 04:45 PM Views : 470

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గురువారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సైబరాబాద్ కంట్రోల్‌రూమ్‌కు ఓ ఆగంతకుడుకు ఫోన్ చేసి బెదరించాడు. దీంతోప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ.. ముమ్మర తనిఖీలు చేశారు.అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని ఎయిర్ పోర్ట్ అధికారులు తేల్చారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా గుర్తించిన అధికారులు.. అతడికి మతిస్థిమితం లేదని నిర్దారించారు. ఇటీవల కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టుతోపాటు దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపలు వచ్చిన సంగతి తెలిసిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :