ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / ముత్తారం : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరుగుతుందని కాంగ్రె స్ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, ముత్తారం మండల అధ్యక్షుడు బాలాజీ ఒక ప్రకటనలో పేర్కొన్ న్నారు.సోమవారం రోజున ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, రామయ్యపల్లె, జిల్లెల్లపల్లి గ్రామాల రైతుల చివరి ఆయ కట్టు పొలాల వరకు సాగు నీరు అందించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు పోగా, తక్షణమే ఇరిగేషన్ ఎస్ఐని ఫోన్లో సంప్రదించి,ఆర్ ఈ డి కెనాల్ కు నీటిని విడుదల చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. సమస్యను తెలియజేసిన వెంటనే స్పందించిన సాగునీటిని విడుదల చేయించేందుకు మంత్రి ఆదేశాలు ఇవ్వడం పట్ల రైతుల పక్షాన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Aakanksha News