ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనిలో నడుస్తున్న రావుస్ స్కూల్ పై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ యువజన సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోరే గణేష్ విద్యాశాఖ అధికారి ఆర్జేడి కి ఫిర్యాదు చేశారు. రావుస్ పాఠశాల తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో విద్యాశాఖ నిబంధనలను అనుసరించకుండా సప్తగిరి కాలనీలో పాఠశాల నడపడమే గాక ఈ విద్యాసంవత్సరం నుండి ఎలాంటి షిఫ్టింగ్ అనుమతులు లేకుండానే ఎన్టీపీసీలో మరొక క్యాంపస్ ప్రారంభించి విద్యార్థులను వారి తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నారని ఈ సందర్భంగా గణేష్ పిర్యాదులో పేర్కొన్నారు. రావుస్ పాఠశాల ఎలాంటి ఫైర్ నిబంధనలు పాటించకుండా ఒకే భవనంలో శ్రీ అక్షర విద్యాలయ, రావుస్ పాఠశాలను నడుపుతూ అసలు విద్యార్థులు ఏ క్యాంపస్ లో చదవాలో ఏ స్కూల్ ద్వారా వాళ్లకు సర్టిఫికెట్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితిలోకి విద్యార్థులను నెట్టివేయడం బాధాకరమని అన్నారు.గత కొన్ని రోజులుగా రావుస్ పాఠశాల విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని అలాగే ఎన్టీపీసీ లో ఎలాంటి అనుమతులు లేకుండా మరో క్యాంపస్ నడుస్తుందని మండల జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన వారు చూసీ చూడనట్టు వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. రావుస్ పాఠశాల అనుమతుల పైన క్యాంపస్ పైన సమగ్రమైన విచారణ జరిపి తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్న రావుస్ యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక వివరణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Admin
Aakanksha News