Thursday, 24 September 2026 10:17:12 PM

మేకప్ స్టూడియో యజమానిపై బ్లాక్ మెయిల్, వేధింపులు....

- నాలుగురిపై కేసు నమోదు....

Date : 12 July 2025 06:18 AM Views : 684

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో మేకప్ స్టూడియో యజమానురాలిపై బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నెం.14లో ‘హెచ్‌కే హర్జిత్ కౌర్ హెయిర్ అండ్ మేకప్’ స్టూడియో నిర్వహిస్తున్న హర్జిత్ కౌర్ గరపాటి (43) అనే మహిళను విజయ్ వాచర్, సోన్ వాచర్, హసన్ షాన్, అనూర్ వాచర్ అనే వ్యక్తులు వేధించినట్టు సమాచారం. తన పాస్‌పోర్ట్‌ను స్టూడియోలో ఉంచిన హర్జిత్ కౌర్, దాన్ని విజయ్, సోన్ తీసుకున్నారని తెలిపారు. తిరిగి ఇవ్వాలని అడిగితే దుర్భాషలాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు తెలిపారు. ఆపై రూ.11,000 చెల్లించిన తర్వాతే పాస్‌పోర్ట్‌ను ఇచ్చినట్టు వెల్లడించారు. ఇకపై మరిన్ని డబ్బులు ఇవ్వాలని, లేదంటే తప్పుడు కేసులు పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఆమెతో పాటు భర్తకు కూడా ఫోన్ చేసి హైరాస్మెంట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తమ ఫోన్ నంబర్లను గేమింగ్ వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :