ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కూకట్పల్లి విభాగ్ సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా ABVP సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలంగా గురుకుల వసతి గృహాల్లో 38 సార్లు ఫుడ్ పాయిజన్ బారిన పడి వెలాది మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారుని, తదితర కారణాలతో దాదాపు 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న కనీస బాధ్యత లేని రేవంత్ సర్కార్ నిమ్మకు నిరుఎత్తినట్టు ప్రవర్తించాడని ABVP తీవ్రంగా ఖండిస్తూంది అని అన్నారు.ఒక బాధ్యత వహించాల్సిన మహిళా మంత్రి కొండా సురేఖ గారు ఫుడ్ పాయిజన్ కి కారణం హాస్టల్ ఫుడ్ తినడం వల్ల జరగలేదు బైట ఫుడ్ వల్ల జరిగింది అని అమాయక విద్యార్థుల పైన నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం పాఠశాల నుండి బాసర ఐఐఐటీ వరకు అన్ని విద్యాసంస్థలలో విద్యార్థులు రోజుకు ఒకరు పిట్టల రాలిపోతున్న ప్రభుత్వం కనీసం విచారణ చెప్పటని కరణంగా మరిన్ని చావులకు దారితీస్తున్నాయిని ముమ్మటకి ఇవి ప్రభుత్వం హత్యలేఅని మండి పడ్డారు.ఉన్న వసతి గృహాలో మౌలిక వసతులు కల్పించలేని అసమర్థ ప్రభుత్వం కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంభిస్తాం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు జరుతున్న అన్యాయాలపైన న్యాయవిచారణ జరిపించి కారకులను కఠినంగా శిక్షించాలి.వసతి గృహాల పక్క భవనాలు నిర్మించాలి,ఇష్టానుసారంగా ఫుడ్ కాంట్రాక్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం బాధ్యత వహించి ప్రభుత్వమే నాణ్యత కలిగిన సరుకులను అందిచాలని ABVP డిమాండ్ చేస్తుంది.లేని యోడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు... రాష్ట్రంలో విద్యార్థులకు సమస్యలు వస్తే చెప్పొకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రి దిక్కులేడు .విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించలె అని ప్రశ్నిస్తే స్వయంగ ముఖ్యమంత్రి పరాయవేక్షయిస్తున్నారని ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ ముఖ్యమంత్రికి కనీసం సోయిలేదు.ముఖ్యమంత్రికి విద్యాశాఖను పట్టించుకోవడం చేతగాదని అనడానికి ఈ సంఘటలన్నీ నిదర్శనం.ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించాలి అని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో లో సికింద్రాబాద్ జిల్లా మెంబెర్షిప్ ఇంచార్జి పాండు,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు ,శ్రీరామ్ ,వంశీ ,పవన్,తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Aakanksha News