Tuesday, 11 August 2026 04:46:23 PM

ఆయుర్వేద వైద్యంతో దీర్ఘ కాలిక వ్యాధుల దూరం

Date : 19 August 2023 04:45 PM Views : 598

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఆయుర్వేద వైద్యంతో దీర్ఘ కాలిక వ్యాధుల దూరమవుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు డా.విశ్వనాధ మహర్షి అన్నారు. ఆర్జీ-1 ఏరియాలోని ఆర్.సి.ఓ.ఎ క్లబ్ లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన మాత రిసేర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు.చర్మ వ్యాధులు కాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, బిపి, షుగర్, మల బద్దకం, అజీర్ణం, పక్షవాతం, అస్తమా, స్త్రీలా వ్యాధులు ఆయుర్వేదంతో నయమవుతాయని వైద్యులు విశ్వనాధ మహర్శి తెలిపారు. ప్రతి నెల నిర్వహించే ఈ శిభిరాన్ని ఉద్యోగులు స్థానిక ప్రజలు సద్వీనియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పిఓ బంగారు సారంగ పాణి, సేవా & కమ్యునికేషన్ కొ-ఆర్డినేటింగ్ అధికారి హనుమంత రావు, కొ-ఆర్డినేటర్స్ మేడి తిరుపతి, నగునూరి రవి కుమార్ పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :