Saturday, 26 September 2026 08:13:44 AM

కేటిఆర్.. మీ కుటుంబం అంతా వెళ్ళి కలిసినప్పుడు కాంగ్రెస్ థర్డ్ క్లాస్ అని జ్ఞాపకం లేదా..?

కిషన్ రెడ్డి మంచోడే..కేంద్రమంత్రి ఐనా స్క్రిప్ట్ రీడరే..! కెటిఆర్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్

Date : 22 August 2025 06:16 PM Views : 594

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ను చిల్లర పార్టీ అంటారా అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని మాజీ సిఎం కెసిఆర్ చెప్పలేదా? అని బిఆర్ఎస్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పై మాట్లాడిన కెటిఆర్ కు క్యారెక్టర్ లేదని, రాజకీయ పరిపక్వత లేదని జగ్గారెడ్డి విమర్శించారు.శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మార్లడుతూ సోనియా గాంధీ..రాహుల్ గాంధీ నీ కేసీఆర్..కేటీఆర్ మీ కుటుంబం అంతా వెళ్ళి కలిసినప్పుడు కాంగ్రెస్ థర్డ్ క్లాస్ అని జ్ఞాపకం లేదా..? కాంగ్రెస్ నుండే కదా మీ నాయన వచ్చింది.. మీ నాన్న కూడా థర్డ్ క్లాసే నా..? కెసిఆర్ థర్డ్ క్లాస్ ఐతే.. కేటీఆర్ ఏ క్లాస్ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు అమెరికా లో జీతం మీద జీవించే వాడివి కదా..? కేటీఆర్ కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు కిషన్ రెడ్డి మంచోడే..కేంద్రమంత్రి ఐనా స్క్రిప్ట్ రీడరే..! యూరియా ఇవ్వాల్సింది కేంద్రమే.. మీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారన్నారు. బీజేపీ నేతల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి వేల కోట్లు రైతులకు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. యూరియా కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వకుండా ఉంటుందా..? BRS వాళ్ళ లెక్క దందాల కోసం సెక్రటేరియట్ లో రివ్యూ చేయలేదు సంగారెడ్డి ప్రజల మంజీరా నీళ్ళ కోసం సమీక్ష చేసిన..మళ్ళీ చేస్తా నేను ప్రతిపక్షం లో ఉన్నా.. అధికార పక్షం లో ఉన్నా... మొగోన్నె కేటీఆర్.. కాంగ్రెస్ నీ తిడుతున్నావు.. మీ తాత బతికి ఉంటే పిలిచి చెంప మీద కొడుతుండే కాంగ్రెస్ త్యాగాల పార్టీ అని నీకు బుద్ధి చెప్పేవాళ్ళుమన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :