ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈనెల 9న సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందజేశారు.ముందుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం బృందం చేరుకుంది. వారికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి పొన్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆహ్వాన పత్రిక అందజేసి ఈనెల 9న జరిగే కార్యక్రమానికి తప్పుకుండా రావాలంటూ పిలిచారు. అనంతరం తన నివాసానికి వచ్చిన పొన్నం బృందానికి కేసీఆర్ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను నేతలు నెమరు వేసుకున్నారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ వస్తారా లేదా? అనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.
Admin
Aakanksha News