Saturday, 26 September 2026 07:23:43 AM

మీ సేవలో దోపిడీ....

అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్నా కొందరు నిర్వాహకులు..

Date : 17 February 2023 04:30 PM Views : 936

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం దరఖాస్తులు కొందరు మీసేవ సెంటర్లకు కాసుల పంటగా మారుతుంది.. ఇదే అదునుగా భావించిన సదరు కొందరు నిర్వాహకులు 35 రూపాయలకు బదులుగా 100 రూపాయలను వసూలు చేస్తూ ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా ప్రాంతంలో ఓ మీసేవ సెంటర్ నిర్వాహకుడు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన స్థానిక ప్రజల నుండి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు మరికొంత మంది మీ సేవ నిర్వాహకులు సైతం ఇలాగే దోపిడీకి గురి చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఓవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాన్ని కొందరు నిర్వాహకులు కాసుల పంటగా మార్చుకుంటున్నారు.. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :