Thursday, 24 September 2026 04:07:43 PM

ప్రతి ఒక్కరు ప్రశ్నించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి...

సీపీఐ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ చదలవాడ హరిబాబు

Date : 06 January 2024 08:40 PM Views : 514

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రతి ఒక్కరు ప్రశ్నించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని, వినియోగదారుడు ప్రశ్నించితేనే ఉత్పత్తిదారు లు నాణ్యమైన వస్తువులు తయారు చేస్తారని సీపీఐ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ చదలవాడ హరిబాబు అన్నారు మాసాబ్ ట్యాంక్ లో గల రెడ్ క్రాస్ ఆఫీసులో మామిడి భీమిరెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశమునకు అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అనంతరం మామిడి భీమ్ రెడ్డి ప్రసంగిస్తూ ఈనెల 29 30 తేదీలలో వినియోగదారులు సంఘ నాయకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సిసిఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అనంత శర్మ శ్రీమతి ప్రీతి పాండేను ఆహ్వానించినామని శిక్షణ నిర్వాణకు ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ శిక్షణ తరగతుల్లో దాదాపు 100 మంది కి కల్తీ ఆహార ఆహార పదార్థాలు తినటం వలన వచ్చే వ్యాధులు సమాచార హక్కు చట్టము 2005 అనుచిత వ్యాపార ప్రకటన వల్ల ఆన్లైన్ వ్యాపారము లోని మోసాలు జిల్లా రాష్ట్రస్థాయి కమిషన్ లో నష్టపరిహారము కొరకు కేసులు ఫైలింగ్ మొదలగు అంశముల మీద శిక్షణ కు ఏర్పాట్లు చేశామని భీమిరెడ్డి తెలిపారు ఈ శిక్షణ తరగతులు పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ కిట్టు మరియు సర్టిఫికెట్లు అందజేస్తున్నామని తెలియజేశారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో శిల్పారెడ్డి శ్రీమతి నాగమణి మరియు డాక్టర్ హరి ప్రియా రెడ్డి డాక్టర్ ఐజాక్ రాజ్ ఆడేమ్రాజ్ సుప్రభా శ్రీధర్ శ్రీనివాస్ దీపిక ప్రియా ప్రతాపరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :