ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఏ దేశమైనా ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలన్న మనిషి జన్మకు స్వార్ధకత పరిపూర్ణత చేకూరాలన్న విద్య విజ్ఞానం ఎంతో అవసరం. ప్రస్తుత సమాజంలో విద్య లేనివాడు వింత పశువు అనే నానుడి ఉండనే ఉంది. సాంకేతిక రంగంలో ప్రగతి పథంలో అభివృద్ధి చెందాలన్న విద్య ఎంతో అవసరం. ఇలాంటి తరుణంలో భారీ ప్రచారాలతో హంగు ఆర్భాటాలతో అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోరంతలను కొండంత చేసి చూపిస్తూ పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను అదుపు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదావరిఖనిలో కొన్ని పాఠశాలలు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే విద్యాసంస్థలను నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... NTPC లోని టౌన్ షిప్ లో నడుస్తున్న శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల ప్రిన్సిపల్ జెట్టి వర్షిత్ అనే ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని అకారణంగా సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో విద్యార్థి తండ్రి జెట్టి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనీస మానవత్వం మరిచి ఆవేశంతో విద్యార్థిడిని ప్రిన్సిపల్ చితకబాదిన తీరుపై ఇటు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు పాఠశాలలో అల్లరి చేస్తే మందలించి తల్లిదండ్రులకు చెప్పడమో, లేక మళ్లీ అలాంటి పనులు చేయకుండా ఉండాలని సర్ది చెప్పడం చేయాలి. కానీ సదురు ప్రిన్సిపల్ అలా చేయకుండా విద్యార్థిడిని తన చేతిలో ఉన్న కర్రతో కొట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పాఠశాలలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది...
అనుమతి ఒకచోట... పాఠశాల నిర్వహణ మరో చోట...
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని పాఠశాలలు ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తుంటే మరికొన్ని పాఠశాలలు అనుమతులు ఒకచోట తీసుకొని పాఠశాలలను మరోచోట నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కార్పొరేట్ పాఠశాలలు అయితే విద్యాసంస్థల్లో రాజకీయాలను చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విద్యార్థిని చితకబాదిన ఘటనలో శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన అనుమతులు NTPC లో ఉంటే పాఠశాల నిర్వహణ మాత్రం RFCL టౌన్ షిప్ లో కొనసాగడం వివాదాలకు దారితీస్తుంది. అంతేకాకుండా పాఠశాలకు సంబంధించి అనుమతి పత్రాలపై శ్రీ చైతన్య పాఠశాల NTPC అని ఉండటం విచిత్రానికి దారితీస్తుంది. ఇప్పటికైనా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు స్పందించి అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పలు కోరుతున్నారు.
Admin
Aakanksha News