ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రధాన చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ పాముకుంట్ల భాస్కర్ బి.ఆర్.ఎస్ పార్టీ అధికార ప్రతినిధి తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు కొట్లాడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. రైతే రాజుగా భావించిన కెసిఆర్ ప్రభుత్వంలో అన్నదాతకు అండగా నిలవాలని.. ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేస్తుంటే, కేవలం మూడు గంటల విద్యుత్ సరిపోతుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనడం రైతన్నలపై ఆయనకున్న మమకారం అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ఆలోచన విధానాలకు నిదర్శనంగా.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిలుస్తాయని అన్నారు. తెలంగాణ రైతాంగ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్,కల్వచర్ల కృష్ణవేణి,జనగామ కవిత సరోజిని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు నారాయణ దాసు మారుతి, జే.వీ రాజు, జావిద్ పాషా,దీటి బాలరాజు, కలువల సంజీవ్, పిల్లి రమేష్, అచ్చ వేణు, అదర్ సండే సమ్మారావు, బెండే నాగభూషణ్ గౌడ్, దాసరి శ్రీనివాస్, జడ్సన్ రాజ్, , నీరటి శ్రీనివాస్, తోకల రమేష్, ముద్దసాని సంధ్యారెడ్డి, కొర్రి ఓదెలు, ముల్కల గోవర్ధన్, కోడి రామకృష్ణ, దొమ్మేటి వాసు, ఈదునూరి శ్రీకాంత్, పర్లపల్లి బాబు, పట్ల మధు, మేకల అబ్బాస్, ఇరుగురాల శ్రావణ్, చింటూ, మహేందర్, చిట్టవేణి వేణు, ఆర్ముల్లా మునీందర్, పిడుగు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News