Friday, 07 August 2026 09:21:30 PM

15 నెలల తరువాత ప్రజలు గుర్తుకు వచ్చారా.. కేసీఆర్?..

టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

Date : 20 February 2025 06:47 AM Views : 666

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : 15 నెలల తరువాత ప్రజలు గుర్తుకు వచ్చారా అని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. బుదవారం గాంధీ భావన లో మెడియా సమావేశం లో మాట్లాడుతూ …. అసెంబ్లీ లో ప్రజల గొంతుకగా మాట్లాడుతారని ఆశించామన్నారు. బీజేపీ పార్టీ లోపలకార ఒప్పందం తోనే ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేయలేదన్నారు. ప్రభుత్వం ప్రాతిష్ఠాత్మికగా కులగణన చేస్తే కనీసం కేసీఆర్ స్పందన లేదు.. ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోచించడం లో పూర్తి విఫలం అయ్యారని విమర్శించారు. కెసిఆర్ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాజకీయ నాటకం ఆడుతున్నారని,కెసిఆర్ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీజేపీ పార్టీ కి బీ టీమ్ వ్యవరింస్తుందన్నారు. BRS భవన్ కు కెసిఆర్ వస్తే అదేదో అద్భుతం లాగా మాట్లాడుతున్నారు.. కెసిఆర్ brs భవన్ వస్తే బూడిద కూడా రాలదు.. … కెసిఆర్ ప్రజల విశ్వాసాలను కోల్పోయిన వ్యక్తి అని అన్నారు. తెలంగాణ రాష్టంను పది ఏళ్లు స్వంత ఆస్తి లాగా వ్యరించారని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేస్తే కేసీఆర్ స్పందన లేదు..… బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తుంది.. బీసీ ల పై కేసీఆర్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి పక్ష నేతగా కేసీఆర్ తన భాద్యత ను విస్మరించుకున్నారు.. * కేసీఆర్ తెలంగాణ లో వ్యాలిడిటీ అయిపోయిన టాబ్లెట్ లాంటి వారు.. ఆయన టాబ్లెట్ తెలంగాణ లో పని చేయదు. కెసిఆర్ ప్రజల కోసం సలహాలు సూచనలు ప్రభుత్వం కోరిన స్పందన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తుంది.. వచ్చే పది ఏళ్లు కాంగ్రెస్ అధికారం లో ఉంతుందన్న ధీమా వ్యక్తం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :