ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో బ్రోకర్లకు మాఫీ ముఠాకు, జెండా పట్టణొల్లకు, దోచుకున్నోళ్లకు కోఆప్షన్ పదవిని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇచ్చారని తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య విమర్శించారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలలో అవినీతి జరిగి ఎంతోమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రామగుండంలో నాయకత్వం సరిగా లేదని ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు విన్నవించిన అధిష్టానం పట్టించుకో లేదని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. కార్మికుడి బిడ్డగా ఆదరించాలని ప్రజలను కోరి చందాలు వేసుకుని ఎమ్మెల్యేగా గెలిపించామన్నారు. నిస్వార్ధంగా సొంత ఖర్చులతో గెలిపించిన ఎమ్మెల్యే నాపై కుట్రకు పాల్పడుతున్నారని విమర్శించారు. అలాగే నా కుటుంబాన్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ రాజకీయ ఒత్తిడిలకు గురి చేస్తూ..హింసలు. కేసులు పెట్టడాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేసారు. అవినీతి పరులకు టికెట్ ఇచ్చి, బీఫామ్ ను అందించారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అవినీతి పరులను ఓడిస్తారని తెలిపారు. ప్రజల్లో వ్యతిరేకత మొదలైన నయవంచకుడు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అని ఘాటుగా ఆరోపించారు
Admin
Aakanksha News