ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇందిరమ్మ రాజ్యం అని,అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ధరణి చట్టం తో భూములు ఉన్న అసములు అనేక ఇబ్బందులు పడ్డామని వారు చెప్పారు. అత్యధికంగా ఇండ్లకు సంబంధించిన అర్జీలు వచ్చాయని తేలిపారు.BRS డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నమూనా చూపి ఎన్నికల్లో గెలిచారు. తప్ప కట్టించలేదని 24 లక్షల ఇండ్లను పేదలకు ఇస్తామని చెప్పాం. ఇస్తాం.. 4వందల చదరపు అడుగుల ఇల్లు కట్టుకోవాలి.మొదటి విడతలో స్థలం ఉన్నవారికి నిర్మాణం కోసం ప్రభుత్వం డబ్బు ఇస్తుంది.గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది.విడతల వారీగా 5 లక్షల రూపాయలను ఇండ్ల నిర్మాణానికి ఇస్తాం.ఇంటికి మహిళ యజమాని పేరిట ఇవ్వాలనేది మా లక్ష్యం.అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే రోల్ మోడల్ గా ఉండే కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం తీసుకువస్తామన్నారు. ధరణిని విదేశీ సంస్థలు తాకట్టు పెట్టారు. దానిని నెల కిందట విడిపించాం.త్వరలో ఉద్యోగాల నియామకాలకు ఇచ్చిన మాట ప్రకారం భర్తీ చేస్తాం.2లక్షల రైతు రుణమాఫీ ఇంకా చేయాల్సి ఉంది.. ఇందిరమ్మ రాజ్యంలో తొండిఆట ఆడం.మిగిలిన అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం.రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం. అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళు. రాష్ట్రంలో పండిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తాం.BRS హాయంలో రైతులను జైల్లో వేసింది మరిచిపోయి.. రైతుల వద్దకు వచ్చి.. ధర్నాలు,నిరాహార దీక్షలు పోరాటాలు అవసరం లేదు.లగా చర్ల ఇష్యూ లో కాస్త ఓపిక పడితే ఒక్కొక్కటిగా బయటకి వస్తాయి.ప్రతిపక్షం మాదిరి తొందర అవసరం లేదన్నారు.
Admin
Aakanksha News