ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : విద్యా,ఉపాధి అవకాశాలను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య అన్నారు. గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో ఏఐవైఎఫ్ నాయకులు వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25న దేశ రాజధాని ఢిల్లీలో జరుగు పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలతో దేశాన్ని పాలిస్తున్న కారణంగానే 200 లకు పైగా ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయబడ్డాయని అన్నారు. దీంతో కోట్లాదిమంది యువత తమ ఉపాధిని కోల్పోయారని,ఎన్నికల ముసాయిదాలో దేశ వ్యాప్తంగా నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని నేటికి పూర్తి స్థాయిలో అమలు చేయకపోగా వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ యువతను మోసం చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని కోరారు.నూతన జాతీయ విద్యా విధానం2020 ను ఉపసంహరించుకోవాలని, దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఏఐవైఎఫ్-ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సంయుక్తంగా నవంబర్ 25వ తేదీన విద్య-ఉపాధి హక్కుల సాధన కోసం "పార్లమెంట్ మార్చ్"ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వేలాదిగా విద్యార్థులు, యువకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి సురేందర్ సహయ కార్యదర్శి వనపాకల విజయ్ నాయకులు రాణవేణి సుధీర్ కుమార్ , ఆసాల నవీన్ కుమార్, శివకుమార్, దిలీప్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News