Tuesday, 11 August 2026 07:16:48 PM

ఘనంగా తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి వేడుకలు

Date : 21 September 2024 02:39 PM Views : 424

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య సమర యోధుడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన వీరుడు ఉమ్మడి ఆదిలాబాద్ ముద్దుబిడ్డ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బాపూజీ చిత్ర పటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తన చేనేత జౌళి శాఖ మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా త్యాగం చేసిన తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ అస్తిత్వం కోసం,ఆత్మగౌరవం కోసం జీవితకాలం పోరాడిన తొలితరం ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కీర్తించారు.అదే విధంగా మంచిర్యాల జిల్లాను కొండా లక్ష్మణ్ బాపూజీ మంచిర్యాల జిల్లా కేంద్రంగా నామకరణం చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ కౌశ్య విగ్రహాన్ని ప్రభుత్వం నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో బీసీ సంఘాల నాయకుడు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య నాయకులు జంజిరాల నారాయణ, బూర్ల దామోదర్,బూర్ల జ్ఞాని,చిందం మొగిలి అడిచర్ల రాజేశం,చిప్ప రామస్వామి,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :