Thursday, 25 June 2026 07:43:57 PM

రాజకీయా క్రీడగా మారిన పేపర్ లీకేజీలు.

సీపీఐ(ఎం-ఎల్) ప్రజాపంధా నాయకులు

Date : 07 April 2023 03:02 PM Views : 527

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : 10వ తరగతి పరీక్షా పత్రాలు, మొన్నటి టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాలు లీకేజీ బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ క్రీడగా మారి, లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమైపోయిందని CPI ML ప్రజాపంధా ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... లీకేజీలకు ప్రధాన సుత్రదారులు, పాత్రదారులు ఎవరో నిగ్గు తేల్చడానికి సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని. మొత్తం తీవ్రమైన ఈ సమస్యను ప్రక్కదారి పట్టి, రాజకీయ క్రీడ, పోలీస్ క్రిమినల్ కేసులు, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పోరాటంగా మారడం శోచనీయం అని అన్నారు.బండి సంజయ్ రాజకీయ క్రీడ, రాజకీయ అవకాశవాదం, ఈ లీకేజీల వ్యవహారాన్ని రక్తికట్టించిందని విమర్శించారు. ప్రభుత్వం, బీజేపీ అసలు సూత్రదారులు ఎవరో అర్థం కాకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు. బండి సంజయ్ ప్రభుత్వాన్ని బాధ్యులుగా చూపిస్తుంటే, ప్రభుత్వం బండి సంజయిని, బీజేపీని బాధ్యులుగా చూపిస్తుందన్నారు. అసలు సూత్రదారులు, పాత్రదారుల గురించి నిరుద్యోగులకు తెలపడం లేదన్నారు.ఈ రాజకీయ క్రీడను ఆవి, లక్షలాది మంది జీవితాలతో ఆటలాడుకుంటున్న, లక్షలాది మంది తల్లి దండ్రులను టెన్షన్ కు గురి చేస్తున్న ఈ లీకేజీల మూలాన్ని స్పష్టంగా కనిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల వలన దోషులు, బాద్యులు తప్పించుకో కూడ.దీని వెనుకు ఎంతటి వారున్న కఠినంగా శిక్షించాలని. మొత్తం ఈ వ్యవహారం పారదర్శకంగా జరగాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :