ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : జాతీయ రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానిస్తూ భారత రాష్ట్ర సమితిగా ఆమోదం తెలిపారు. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆమోదించారు. ఇక ఇప్పటి నుండి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిపోయింది. దీనిపై ఎన్నికల కమిషన్ కు కూడా లేక పంపనట్లు తెలుస్తుంది. టిఆర్ఎస్ ప్రతినిధులతో పాటు పలు రాష్ట్రాల్లోని పలు నేతల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన చేశారు.
Admin
Aakanksha News