Monday, 10 August 2026 02:11:10 PM

పైలాన్ ను ఆవిష్కరించిన రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్

Date : 08 May 2023 08:15 PM Views : 1005

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 112.65 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు పైలాన్ ను రాష్ట్ర పురపాలక,ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ఆవిష్కరించారు. రామగుండం పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కోర్టు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ను మంత్రి ప్రారంభించారు.అలాగే 5 ఇంక్లైన్ కూడలి వద్ద 48 లక్షలతో నిర్మించిన కూడలి సుందరీకరణ పనులను, మల్కాపూర్ లో 1.2 ఎకరాల విస్తీర్ణంలో 3 కోట్ల 80 లక్షల వ్యయంతో నిర్మించిన ఫికల్ స్లడ్జి ట్రిట్మెంట్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు వి. లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, మునిసిపల్ కమిషనర్ సుమన్ రావు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :