ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి జిల్లా : సింగరేణి వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న సింగరేణి ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం సింగరేణి ఎన్నికలపై దృష్టి సారించి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు బొగ్గు బావల మీద ప్రచారాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో గత రెండు రోజుల క్రితం వరకు కూడా పోటీలో ఉంటుందా ఉండదా అనే ఓ కార్మిక యూనియన్ పరిస్థితి సందిగ్ధంగా మారిన నేపథ్యంలో తాజాగా సింగరేణి వ్యాప్తంగా మన ఊరు మినహాయించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో కామ్రేడ్లకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఆయా నాయకులు సమావేశాలను ఏర్పాటు చేసి తమ నాయకులకు సూచించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీకి పోటీ ఇచ్చేందుకు కామ్రేడ్లకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం....
Admin
Aakanksha News