Tuesday, 11 August 2026 06:53:41 PM

బి.సి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి...

ఫిబ్రవరి 6 న ఛలో ఢిల్లీ.... పోస్టర్ ను విడుదల చేసిన ఆర్.కృష్ణయ్య

Date : 30 January 2025 04:40 PM Views : 416

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బి.సి లకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బి.సి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, OBC జాతీయ సెమినార్లు జరపాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 6 మరియు 7న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు రాజ్యసభ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల నుండి పెద్ద యెత్తున పోల్గొంటారని తెలిపారు. ఈ ఛలో డిల్లీ కార్యక్రమానికి సంబందించిన వాల్ పోస్టర్ ను ఆర్. కృష్ణయ్య విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సుగుణవతి, గుజ్జ కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సెమినార్ లో వివిద పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు బి సి లను ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నారు. రాజ్యాధికారంలో వాట ఇవ్వకుండా 76 సం.లుగా అన్యాయం చేస్తూన్నారు. జెండాలు మోసుకుంటు, జిందాబాద్ ల నినాదాలు ఇస్తూ బిసిలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.బిజెపి పార్టీ బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చేశారు. ఇటివల నలుగురు గవర్నర్లు బి.సి వర్గానికి చెందిన వారిని నియమించారు. జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్ధమైన హోదా ఇచ్చారు. కేంద్రంలో బి.సి రిజర్వేషన్లను వర్గీకరించడానికి కమిషన్ ను నియమించాలి. ఇంకా మిగిలింది బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీలకు సామాజిక న్యాయం కల్పించామన్నారు. కేంద్రంలో బి.సి.లకు ప్రత్యక మంత్రిత్వ శాఖ పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.ఈ సందర్బంగా బి.సి సంక్షేమ సంఘం మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి గా చెరుకుల సుగుణవతిని నియమించడం జరిగిందణి తెలిపారు. ఈ సమావేశం లో నీలా వెంకటేష్, ,సుదాకర్ ముదిరాజ్,మట్ట జయంతి,వేముల రామకృష్ణ,అనంతయ్య, రాజేందర్,మనికంట,నికిల్, బాల స్వామి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :