Tuesday, 11 August 2026 07:33:04 PM

ఎమ్మెల్సీ కవితకు మంథని బిఆర్ఏస్ పార్టీ అండగా ఉంటాం....

మంథని జడ్పీ చైర్మన్ పుట్ట మధు

Date : 09 March 2023 06:25 PM Views : 578

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్న బిజెపి ప్రభుత్వ తీరుపై పెద్దపల్లి జిల్లా మంతిని జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఖండించారు. ఎమ్మెల్సీ కవితను కక్షకట్టుకుని ఇబ్బంది పెట్టే విధంగా దర్యాప్తు సంస్థలతో బిజెపి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా మంథని లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ అని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్సీ కవితకు మంథని బిఆర్ఎస్ పార్టీ నేతలు అండగా ఉంటారని అన్నారు. ఈడి తో వేధింపులకు గురి చేస్తున్న తీరును యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్నామని అధికార సంస్థలను వాడుకోవడం సరైనది కాదని అన్నారు. అలాగే బిజెపి ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :