ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : రామగుండం రాజకీయాలపై సోమరపు సత్యనారాయణ తనదైన శైలిలో ముద్ర వేశారు. ఏ పార్టీలో ఉన్న తనకంటూ ఒక్క ప్రత్యేకతను చాటుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పవచ్చు. గతంలో రెండు పర్యాయలుగా ఎమ్మెల్యేగా పని చేసి రామగుండం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని పలువురు రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే చెప్పుతూ ఉంటారు. అయితే సోమారపు సత్యనారాయణ ఎంతో రాజకీయ అనుభవం కలిగి ఉండటమే కాకుండా రాజకీయల్లో దిట్ట అనే పేరు కూడా నియోజక వర్గంలో ఉందనే చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో రాజకీయాల్లో ఎన్నో సంచలనాలకు తెర తీసిన సోమారపు మరో అడుగు ముందుకు వేసి మరో సంచలనం సృష్టించబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన అతి తక్కువ కాలంలోనే బీజేపీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవిని సైతం అప్పగించారు. అయితే కొంతమంది సొంత పార్టీ నాయకుల వ్యవహార శైలి నచ్చక పోవడంతో బిజెపి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై తన ముఖ్య అనుచరులు,కార్యకర్తలు, సన్నిహితులతో రెండు నెలలుగా చర్చలు జరిపిన అనంతరం చివరికి కార్యకర్తల అభిష్టానం మేరకు బిజెపికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో సోమారపు సత్యనారాయణ తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్దపెల్లి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.అయితే కొంతమంది సొంత పార్టీ నాయకుల వ్యవహార శైలి నచ్చక పోవడంతో బిజెపి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై తన ముఖ్య అనుచరులు,కార్యకర్తలు, స్నేహితులతో రెండు నెలలుగా చర్చలు జరిపిన అనంతరం చివరికి కార్యకర్తల అభిష్టానం మేరకు బిజెపికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో సోమారపు సత్యనారాయణ తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్దపల్లి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం FCI లో ఇంజనీర్ గా పని చేసే సమయంలో సోమారపు సత్యనారాయణ మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేసి విజయం సాధించారు.తర్వాత మంథని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా టిడిపి తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అలాగే 2009 లో రామగుండం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఎమ్మెల్యే గా గెలిచిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోమరపు సత్యనారాయణకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు కట్టబెట్టింది. ఆ తర్వాత 2018 లో ఓటమీ అనంతరం బిజెపి పార్టీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. బిజెపిలో చేరిన అతి తక్కువ కాలంలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అంతర్గత విభేదాలతో జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సోమవరపు సత్యనారాయణ బీజేపీ పార్టీలో అట్టిముట్టినట్లే వ్యవహరించారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి తమ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే సోమారపు ఎటువంటి ప్రచారం నిర్వహించకుండా నిశ్శబ్ద రాజకీయాలను కొనసాగిస్తూనే తన గెలుపుకు పునాదులు వేశారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరు ఉన్న సోమారపు మరో సారి తన మార్క్ చాటేందుకు సిద్ధం కావడంతో పెద్దపల్లి జిల్లాలో రాజకీయ సమీకరణాలలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Admin
Aakanksha News