Thursday, 24 September 2026 03:33:13 PM

నేడు నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభ...

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి సభకు హాజరుకానున్న కేసీఆర్

Date : 13 February 2024 06:36 AM Views : 526

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఓటమిపాలైన అనంతరం తొలిసారిగా జనంలోకి వస్తున్నారు. నల్గొండలోని మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద 50 ఎకరాలలో రైతు గర్జన పేరుతో మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సు ద్వారా సభ స్థలికి చేరుకొనున్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :