Friday, 07 August 2026 04:23:37 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్‌ మీడియా అకౌంట్స్‌ హ్యాక్‌...

Date : 17 January 2024 06:44 PM Views : 602

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్‌ మీడియా అకౌంట్స్‌ హ్యాక్‌ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌(ట్విట్టర్‌) హ్యాక్‌కు గురయ్యారయని కవిత తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పలుసార్లు హ్యాకింగ్‌కు యత్నించారన్నారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి సంబంధంలేని వీడియోను పోస్ట్‌ చేశారని తెలిపారు. వెంటనే గుర్తించి సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ఎక్స్‌(ట్విట్టర్‌) ద్వారా తెలిపారు. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇవాళ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) అకౌంట్‌ సైతం హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :