ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : మార్చి 21 నుండి ప్రారంభమైన సిపిఎం పార్టీ పాదయాత్ర సోమవారం అడ్డగుంటపల్లి సుందరయ్య నగర్ నుంచి ప్రారంభమైంది, భరత్ నగర్, చంద్రశేఖర్ నగర్, ఎన్టీఆర్ కాలనీ, ద్వారక నగర్, తిలక్ నగర్ లో ఈ పాదయాత్ర ను కొనసాగించారు.ఈసందర్భంగా పాదయాత్ర బృందం సభ్యులు, జిల్లా కార్యదర్శి వై యాకయ్య, వేల్పుల కుమారస్వామిలు మాట్లాడుత... ఈ రామగుండం కార్పొరేషన్ లో పేద ప్రజలు ఇండ్లు ఇండ్ల స్థలాలు లేక డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు సరైన మురికి కాలువలు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అలాగే త్రాగునీరు లేని పరిస్థితి ఉందని, అనేక సంవత్సరాల నుంచి వలస వచ్చిన కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతూ చాలి చాలని ఇండ్లు ఇరుకు గదులలో నివసిస్తున్న పరిస్థితి అని పేర్కొన్నారు.ఇక్కడ పరిస్థితులను పాలక వర్గం నాయకులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితులలో లేదని తెలిపారు. పూర్తిస్థాయిలో పేద ప్రజల పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని, పోరాటాల ద్వారానే ఇండ్లు ఇండ్ల స్థలాలు స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రజలను చైతన్యం చేస్తున్నామని తెలియజేశారు. మా పాదయాత్ర ద్వారా వెలుగులోకి వస్తున్న సమస్యల పరిష్కారానికి, రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం, ప్రభుత్వ యంత్రాంగం పేద ప్రజలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు సరైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పాదయాత్ర బృందం సభ్యులు ఏ మహేశ్వరి, లావణ్య, ఎన్ బిక్షపతి, సిపిఎం పార్టీ కార్యకర్తలు కిషన్, చంద్రయ్య రాజ్ కుమార్, ఎన్ నరసన్న, యం శ్రీనివాస్, ఏం సారయ్య, గుత్తికొండ గోపాల్, ఎస్ వెంకన్న, నాగమణి, రాధాకృష్ణ, అన్నం శ్రీనివాస్, నాయక్, 30 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Aakanksha News